చందుర్తి,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో చందుర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినివిద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో పదవతరగతి పరీక్షకు 249 మంది హాజరు కాగా 236 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 127 బాలురులకు గాను 119 పాసయ్యారు. 122 బాలికలకు 117 ఉత్తీర్ణలయ్యారు. బండపల్లి, మల్యాల, మరిగడ్డ,
నర్సింగాపూర్ తో పాటు మండల కేంద్రంలోని కస్తూర్బా హైస్కూల్ పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. మూడపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన వట్టిమల్ల మణిచరణ్ 9.8, మల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన శ్రీధర్ల శ్రీజ 9.5 గ్రేడింగ్ పాయింట్స్ సాధించారు. గడ్డం శివప్రియ ఎన్గల్ హైస్కూల్, ఇల్లంతకుంట మణిచంద్ర మూడపల్లి హైస్కూల్ యం సాత్విక , నర్సింగాపూర్ హైస్కూల్ విద్యార్థులు 9.3 సాధించారు.
వీరికి మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు అభినందించారు.
పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజయకేతనం
