బిఆర్ టియు జిల్లా అధ్యక్షులు శివశంకర్ రావు పిలుపు….
కొల్చారం,(మెదక్) నేటిధా త్రి :-
భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే 138 వ మేడే ఉత్సవాలను కార్మిక లోకం జయప్రదం చేయాలని సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శివశంకర్ రావు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ మరియు బిజెపి అవలంబిస్తున్నాయని అన్నారు. బిజెపి 44 లేబర్ కోడ్ లను 4 చట్టాలుగా మార్చి కార్మికుల నడ్డి విరిచి, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీ లను తిరస్కరించి. లోక్ సభ ఎన్నికల్లో కార్మిక లోకం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు. మే 1న ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి జిల్లా నుండి కార్మికులు బిఆర్ టి యు నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు ఈ కార్యక్రమంలో సాబీర్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.