నర్సంపేట,నేటిధాత్రి :
దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పలువురు నాయకులు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి, మండల ఆధ్యక్షుడు ఎర్రెల్ల బాబు ఆధ్వరంలో మంగళవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే దొంతి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బోటికే సంజీవ, మడిపెల్లి చంద్రమౌళి, అపరాధపు కుమారస్వామి, కుసుమ సత్యనారాయణ, ముప్పురపు రవీందర్, శ్రీనివాస్, వేముల రాజుతో పాటు పలువురు చేరారు. కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల ఇంద్రదేవ్, సీనియర్ నాయకులు బూర్గు రవీందర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొలిపాక బుచ్చయ్య, తదితరులు ఉన్నారు.