గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే చల్లా
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు బిఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు బండి వెంకటేష్, గందే అనిత కాంగ్రెస్ పార్టీ వీడి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో మంగళవారం రోజున బిఆర్ఎస్ లో చేరారు.వారికి పార్టీ కండువా కప్పి మాజీ ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.పార్టీలో చేరిన అనంతరం మాట్లాడుతూ కొందరి మాయ మాటలు నమ్మి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామని అన్నారు.
బిఆర్ఎస్ లో చేరిన బి.ఎస్.పి మండల అధ్యక్షులు
మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన బిఎస్పీ మండల పార్టీ అధ్యక్షులు పెండేల మంహెందర్ ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మహేందర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.