సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిదాత్రి :
ప్రపంచ కార్మిక దినోత్సవం138వ మేడే ను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కొమరం సీతారాములు, అరేం నరేష్ లు పిలుపునిచ్చారు
సోమవారం మండల కేంద్రంలోని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) ముద్రించిన మేడే పోస్టర్ను ఆవిష్కరణ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో అనేక రకాలైన ప్రభుత్వ సంస్థలు ఎల్ఐసి, ఎయిర్ పోర్టులు, ఓడరేవులు, రోడ్డు మార్గాలను ప్రైవేట్ కంపెనీలైన ఆదాని,అంబానీ తదితర కుబేరులకు అప్పనంగా కట్టబెట్టిందని, ఈ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులను రోడ్డుపాలు చేసిందని విమర్శించారు.
అనేక పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్రులు విభజించి కార్మికులకు తీరని ద్రోహం చేసిందని అన్నారు.
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ ఆర్ఎస్ఎస్,బిజెపి అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు పర్శకరవి, ఈసం కృష్ణన్న,గడ్డం లాలయ్య, పాయం ఎల్లన్న, ఎట్టి గాదెయ్య, కల్తీ నరసన్న గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు చింత నరసన్న,మెంతిని నగేష్, తదితరులు పాల్గొన్నారు.