
భద్రాచలం నేటి ధాత్రి
కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది, ఆంధ్రాలో మిలీనమై ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపి అభివృద్ధి చేయగల సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది….
రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేయాలని దేశ ప్రజలకు నిర్ణయించుకున్నారు….
ఇండియా కూటమి దేశంలో అత్యధిక సీట్ల సంపాదించి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది….
*మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి
ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలంలోని స్థానిక రెవిన్యూ కాలనీ,అయ్యప్ప కాలనీ, అశోక్ నగర్ కొత్త కాలనీలలో మాజీ గ్రంథాల చైర్మన్ *భోగాల శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి *పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుకుంటూ విస్తృతంగా కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బోగాల శ్రీనివాసరెడ్డి ప్రజలతో మమేకమై మాట్లాడుతూ….
భద్రాచలంలో ప్రతి సమస్యను ఎరిగిన వ్యక్తి, భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ బరిలో ఉన్న *పోరిక బలరాం నాయక్
మన ప్రాంత సమస్యల గురించి, అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి *బలరాం నాయక్ ని గెలిపించుకోవడం ద్వారానే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని, గతంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేయటం జరిగిందని, ప్రజలందరూ తప్పనిసరిగా ఆలోచించి *బలరా నాయక్ బలపరచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
దేశంలో హింసాత్మక, మతపరమైన పాలన కొనసాగిస్తున్నటువంటి బిజెపి ప్రభుత్వాన్ని,రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా ప్రజల తరిమికొట్టారో,అదే విధంగా దేశంలో బిజెపిని తరిమికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
దేశ ప్రజలందరికీ సమన్యాయ పాలనా అందించడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఐదు న్యాయాల మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకు వచ్చిందని, దేశ ప్రజలందరి మద్దతుతో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని,తద్వారా రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలుపరిచిన విధంగానే దేశంలో ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ న్యాయమైన పాలన అందిస్తుందని ఆయన ప్రజలకు వివరించారు.
ఈ ఎన్నికల ప్రచారంలో ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాసమల రాము,ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నెం రామిరెడ్డి, మహిళ కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి, కట్ట కళ్యాణి,పద్మప్రియ, ఎస్సీ సెల్,ఎస్టీ సెల్, మహిళా కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.