https://epaper.netidhatri.com/view/247/netidhathri-e-paper-27th-april-2024%09/3
`అడుగడుగునా కేసిఆర్‌కు జన నీరాజనం.
కేసిఆర్ రోడ్ షోలకు వస్తున్న జనాన్ని చూసి కాంగ్రెస్, బిజేపి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న పార్లమెంటు ఎన్నికల విశేషాలు ఆయన మాటల్లోనే…
`ఎండల్లో కూడా ఏమి జనం..
`కేసిఆర్‌ను చూడడానికి ఎగబడుతున్న జనం.
`కేసిఆర్ చెప్పేది వినడానికి ఎదురుచూస్తున్న జనం.
`పదేళ్ళ పాటు కేసిఆర్ పాలనలో చల్లగా వున్న జనం.
`పదేళ్ళు కాలు మీద కాలేసుకొని బతికిన జనం.
`కరంటు కోతలు లేవు.
`సాగు నీటికి విరామం లేదు.
`మంచి నీటి కటకట లేదు.
`కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది.
`అందుకే తెలంగాణ కేసిఆర్‌ను కలవరిస్తోంది.
`కేసిఆర్ మాటలు విని పులకరిస్తోంది.
`మళ్ళీ మా కేసిఆర్‌ను గెలిపించుకుంటామని అంటోంది.
`అందుకే కేసిఆర్ రోడ్ షోలకు ప్రజలు బ్రహ్మరథం పడుతోంది.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఉద్యమ కాలాన్ని మించిన తెలంగాణ అభిమానం జనం కేసిఆర్‌కు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కేసిఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు ఇసకేస్తే రానంత జనం హజరౌతున్నారు. స్వచ్చందంగా ప్రజలు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. ఎండలను కూడా ప్రజలు లెక్క చేయడం లేదు. తమ కోసం వస్తున్న తమ అభిమాన నాయకుడి కోసం ఎంత సేపైనా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రధాత, విధాతను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఆయన చెప్పేది వినేందుకు వస్తున్నారు. ఆయనను చూస్తే చాలు అన్నట్లు బారులు తీరుతున్నారు. ఇది ప్రజల్లో కేసిఆర్‌కు వున్న క్రేజ్ అన్నది మరోసారి రుజువౌతోంది. అసలు ఇంత ఎండల్లో అంత జనమేమిటన్నది మేమే ఆశ్యర్యపోతున్నాం. అంటే ప్రజలు తమ కష్టాలు తెలిసిన నాయకుడు వస్తున్నాడు. మమ్మల్ని ఆదుకునేందుకు వస్తున్నాడు. మాకు అండగా నిలిచేందుకు వస్తున్నాడు. అన్న ఆలోచన ప్రజల్లో వుంది. అందుకే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కేసిఆర్‌ను చూసి, ఆయనకు మద్దతుగా నిలిచేందుకు ప్రజలు ఎక్కడిక్కడ చీమల దండుగా వస్తున్నారు. రోడ్ షోలు జన సంద్రాలన తలపించేలా చేస్తున్నారు. కేసిఆర్ మాట్లాడుతుంటే జేజేలు పలుకుతున్నారు. మా సిఎం. మా సిఎం. అంటూ జేజేలు పలుకుతున్నారు. కేసిఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కేసిఆర్‌ను చూసి పులకించి పోతున్నారు. తమను ఆదుకునే నాయకుడిని మళ్లీ కొంత కాలం తర్వాత ప్రత్యక్షంగా చూడడంతో పార్టీ శ్రేణులు కూడా పూనకాలొచ్చినంతగా సంతోషపడుతున్నారు. కేసిఆర్ రోడ్ షోలకు వస్తున్న క్రేజ్ అంత ఇంతా కాదు. బలమైన ప్రతిపక్షం అంటే ఇలా వుంటతుందని కూడా నిరూపించేలా ప్రజలు కేసిఆర్‌కు మద్దతుగా వస్తున్నారు. ఇదిలా వుంటే కేసిఆర్ రోడ్ షోలను చూసి, కాంగ్రెస్, బిజేపిల గుండెల్లో రైళ్లు పరుగెడతున్నాయి. ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఆశలు వదిలేసుకోవాల్సిందే. వాటి అడ్రస్ ఇక గల్లంతే. ప్రజల్లో కాంగ్రెస్ మీద తీవ్రమైన కోపం వుంది. బిజేపి అంటేనే మండిపడుతున్నారు. కేంద్రంలో పదేళ్లు అదికారంలోవుండి బిజేపి తెలంగాణకు తీరని అన్యాయంచేసింది. నాలుగు నెలలకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతోంది. అందుకే ప్రజలు కేసిఆర్ నాయకత్వం కోసం చూస్తున్నారు. కేసిఆర్ రోడ్ షోలను చూస్తున్న కాంగ్రెస్, బిజేపిలు నిన్నటి దాకా ఒక లెక్క..ఇకపై ఒక లెక్క అని రోజులు లెక్కపెట్టుకోవాల్సి వస్తోందంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర రాజకీయాలు కేసిఆర్ రంగ ప్రవేశంతో మలుపు తిరుగుతున్నాయి. ప్రజలు కేసిఆర్‌కు బ్రహ్మ రధం పడుతున్న తీరును చూస్తే బిఆర్‌ఎస్ మెజార్టీ సీట్లను గెలుకుంటుందని చెప్పడంలో సందేహం లేదంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నేటి ధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న పార్లమెంటు ఎన్నికల ప్రచార విశేషాలు…ప్రజల స్పందనలపై ఆసక్తికర వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…
ఎండల్లో ఏమి జనం..ఏమి జనం. నిజంగా అందనం ఆశ్చర్యపోతున్నాం.
అంతంత ఎండల్లో ప్రచారాలంటే నాయకులకు ఎంతైనా కొంత ఇబ్బందులే.. ప్రచారాలకు హజరయ్యే ప్రజలను చూసి నాయకులు బాధలు మర్చిపోతారు. మరింత ఉత్సాహంగా ప్రచారంలో పాలు పంచుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల సినారియో మారిపోయింది. కేసిఆర్ రంగ ప్రవేశంతో బిఆర్‌ఎస్ ఊపు ఎలా వుంటుందో కాంగ్రెస్, బిజేపిలు చూస్తున్నారు. కేసిఆర్ రోడ్ షోలకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్, బిజేపిల్లో వణుకు మొదలైంది. ఎందుకంటే కేసిఆర్ తన పాలనలో తెలంగాణలో అరవై ఏళ్ల గోసను లేకుండా చేశాడు. ప్రజలు కోరుకున్న తెలంగాణను ఆవిష్కరించాడు. అరవై ఏళ్లుగా ప్రజలు పడుతున్న బాధలను నుంచి విముక్తి చేశాడు. ప్రజలు కోరుకున్న తెలంగాణ తెచ్చేందుకు 14 సంవత్సరాల పాటు సుధీర్ఘమైన పోరాటం చేశాడు. తెలంగాణ సాదించాడు. తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసిఆర్ కంటే ప్రజల మీద ఎవరికీ మమకారం ఎక్కువగా వుండదు. ఆ విషయం ప్రజలకు కూడ తెలుసు. కాకపోతే గత ఎన్నికల్లో ప్రజలు కొంత మోస పోయారు. కాంగ్రెస్ చేసిన అసత్య ప్రచారాలను ఆనాడు సమర్ధవంతంగా మేం తిప్పికొట్టలేకపోయాం…అందుకే కొంత గత శాసన సభ ఎన్నికల్లో వెనుకబడిపోయాం. అంతే తప్ప మా పార్టీ ఓడిపోలేదు. కేవలం 1.8శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ గెలించింది. బిఆర్‌ఎస్ ఓడిపోయింది. నిజానికి అది ఓటమే కాదు. కాని గెలిచిన కాంగ్రెస్ మళ్లీ తన పాత వాసనలు వదులుకోలేదు. ఆ పార్టీ పాలనా విధానంలో మార్పు రాలేదు.
అదే మోసం…అదే వంచన..నమ్మించి మోసం చేయడంలో కాంగ్రెస్‌ను మించిన పార్టీ లేదు.
అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఆరు గ్యారెంటీలలో దాగి వున్నవి మొత్తం 13 హమీలు. వాటిలో కేవలం రెండు మాత్రమే అమలు చేస్తూ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామంటున్నారు. ప్రజలు ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు. ప్రజలు దేనినైనా భరిస్తారు. కాని నయ వంచనను మాత్రం ఎప్పుడూ క్షమించరు. అదే ఇప్పుడు కాంగ్రెస్‌కు శాపంగా మారబోతోంది. రైతు బంధు పూర్తి చేయలేదు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం లేదు. యువతులకు స్కూటీలు లేవు. ప్రతి మహిళకు రూ.2500 లేవు. అసలు పించన్లే సరిగ్గా అందడంలేదు. నెలకు రూ.4వేలు అన్న హమీకి దిక్కేలేదు. ఇలా చెప్పుకుంటూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హమీలు గాలికి వదిలేశారు. గెలిచిన వెంటనే రుణ మాఫీ అన్నారు. తర్వాత వందల రోజులు గడువు కావాలన్నారు. ఇప్పుడు మళ్లీ ఆగష్టు 15 అంటున్నారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు విసిసిరిన సవాళును స్వీకరించలేక జారుకున్నారు. అంటే రైతు రుణ మాఫీ చేయలేమని చేతులెత్తేసినేట్లే…కాంగ్రెస్‌పార్టీ రైతులను నట్టెట ముంచినట్లే…అందుకే ప్రజలు మరోసారి నమ్మడానికి సిద్దంగా లేరు. వారికి ఓట్లేసేందుకు ముందుకు రాదు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను తిట్టిన టిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఓట్ల ప్రచారం కోసం వెళ్తున్నవారిని అడుగడుగునా ప్రజలు నిలదీస్తున్నారు. ఆరు గ్యారెంటీలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణలో చెరువులు ఎండిపోతున్నాయి. పంటలు కొన్ని లక్షల ఎకరాల్లో ఎండిపోయాయి. పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దిక్కులేదు. వడ్లకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తున్న దాఖలాలు లేవు.
కాంగ్రెస్ పాలనలో అన్నీ వైఫల్యాలే…కరంటు కోతలు. మంచి నీటి కటకటలు…ఒక్కటి కాదు.
.తెలంగాణ మొత్తం సమస్యలే…అందుకే ప్రజలు కేసిఆర్ కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌ను నమ్మి కష్టాలుకొని తెచ్చుకున్నట్లైందని మధన పడుతున్నారు. పదేళ్ల పాటు చుక్క నీటి కోసం గోస పడిరది లేదు. మంచి నీటి కోసం కులాయి దగ్గరకు వెళ్లింది. బోర్ల వాడకం కూడా ఏనాడో తగ్గిపోయింది. ప్రతి ఇంటికి మిషన్ భగీరధ నీళ్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో నిరంతరం నీటిని సరఫరా చేసిన ఘనత కేసిఆర్‌ది. ఒకప్పుడు వారానికి ఒక రోజు మంచినీళ్లు వచ్చేవి. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా నిత్యం వచ్చేలా చేసిన పాలకుడు కేసిఆర్. మళ్లీ ఇప్పుడు మూడు రోజులకోసారి నీళ్లు వస్తున్నాయంటే ఇంతకన్నా దౌర్భాగ్యమేమైనా వుంటుంది. పదేళ్ల పాటు ఏ ఒక్కనాడు వాటర్ ట్యాంకర్ల అవసరం హైదరాబాద్ ప్రజలకు రాలేదు. కరంటు కోసం జనరేటర్ల అవసరం పడలేదు. ఇప్పుడు మళ్లీ వాటి అవసరం వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేత గాని తనం వల్ల ప్రజలు మళ్లీ గోస పడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది. నిండు కుండగలాగా, నీళ్ల గంగాళం లాగా వున్న తెలంగాణ భూగర్భాన్ని కూడా ఎండబెట్టిన దిక్కుమాలిన పాలన కాంగ్రెస్ పార్టీది. గత ఐదు నెలల క్రితం కూడా విస్తారంగా వున్న భూగర్భ జలాలు, అడుగంటుతున్నాయి. బావులు ఎండిపోతున్నాయి. బోర్లు పాడౌతున్నాయి. నదుల నీళ్లన్నీ సముద్రం పాలు చేసి, బిఆర్‌ఎస్‌ను అబాసు పాలు చేయాలని కుట్రచేశారు. ప్రజలకు నరకం చూపుతున్నారు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్దంగా వున్నారు.