కాంగ్రెస్ పార్టీలో చేరిన గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
దేశంలో పార్లమెంట్ ఎన్నికలు పురస్కరించుకొని శుక్రవారం రోజు బాలానగర్ మండలంలోని హేమాజిపూర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలమూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కి మద్దతుగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ఆ గ్రామంలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామ బిఆర్ఎస్ పార్టీ యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు..