ఎమ్మెల్సీ సిరికొండ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో
తెలంగాణ తొలి మలి ఉద్యమకారుడు గణపురం టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దివంగత సాయన్న సేవలు మరువలేనివని తెలంగాణ తొలి శాసనసభ సభాపతి, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన ముక్కెర సాయిలు దశదిన కార్యక్రమం శుక్రవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఎమ్మెల్సీ సిరికొండ హజరై సాయిలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ 23 ఏండ్లుగా సాయన్న తన వెంటే ఉండి టీఆర్ఎస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారన్నారు. పార్టీ కార్యక్రమల్లో చురుకుగా పాల్గొంటూ ఇటు పార్టీ శ్రేణులు, అటు ప్రజల గుండెల్లో అలుపెరగని ఉద్యమ నాయకుడిగా తనదైన ముద్ర వేసున్నారన్నారు. సాయన్న నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారంతో పాటు టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఇలాంటి నాయకుడిని కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని అన్నారు. భౌతికంగా సాయన్న మన మధ్య లేకపోయినా ఎప్పుడూ మన మనస్సులోనే ఉంటారని అన్నారు. సాయిలు ఆత్మను శాంతి చేకూరాలని ప్రార్థించారు. సాయిలు కుటుంబానికి బీఆర్‌ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు బైరగాని కుమారస్వామి గంజి జన్నయ్య మామిడి నరసింహస్వామి మొటపొతుల చందర్ గౌడ్ తంగెళ్లపెల్లి వెంకట్ అకుల తిరుపతి పులిగిల్ల కొవ్వూరి శ్రీనివాస్ ల్యాదల్ల శంకర్ దూడపాక నరసయ్య రమణాచారి తదితరులు ఉన్నారు.