# పీఎం కిసాన్ ఈ కే వై సి లో సమస్య ల లేకుండా చూడాలి.
ములుగు జిల్లా నేటిధాత్రి
ములుగు జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వ్యవసాయ అధికారి జయచంద్ర తో కలిసి వ్యవసాయ రంగం పై వ్యవసాయ విస్తీర్ణ అధికారులతొ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం చేసే రైతులకు స్థానిక వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అందుబాటులో ఉండాలని వ్యవసాయం లో రైతుల కు వచ్చే సమస్యలను పరిష్కరించాలని , సమస్య తీవ్రతను బట్టి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. వివిధ అంశాలలో రైతులకు వచ్చే సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. క్లస్టర్ ల వారిగా ఉండే వ్యవసాయ అధికారులు స్థానిక ఫర్టీలైజర్ దుకాణాలలో ఉండే స్టాక్ పై దృష్టి పెట్టాలని, షాప్ యజమానులు మందులు కొనుగోలు చేసిన తరువాత రైతులకు తప్పని సరిగా రశీదు ఇవ్వాలని తెలిపారు. పీఎం కిసాన్ ఈ కె వై సి లో సమస్యలు రాకుండా చూడాలని అన్నారు. రైతుల భూముల స్వర్వే నంబర్ ఆధారంగా పంటల వారిగా క్రాప్ బుకింగ్ చేయాలని తెలిపారు. వ్యవసాయ అధికారులను ఈపాస్ ఏ ఈ ఓ లాగిన్ ఏ విధంగా పని చేస్తుందో అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ ములుగు మండలంలోని రామచంద్రపురం గ్రామం లోని దుబాసి చంద్రమౌళి ఫర్టిలైజర్ షాప్ ను సందర్శించారు. షాప్ లోని స్టాక్ వివరాలు, రశీదులు పర్శిలించారు. ఈపాస్ యంత్రాల పనితీరు తదితర వివరాలను షాప్ యజమానిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ములుగు ఏడి కే.శ్రీపాల్ , ఏటూరు నాగారం ఏడి యన్.శ్రీధర్ , స్థానిక వ్యవసాయ అధికారి సంతోష్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.