గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రం నుండి వరంగల్ బిజేపి ఎంపీ అభ్యర్థి అరురి రమేష్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలనీ బీజేపీ మండల అద్యక్షుడు జిట్టబోయిన సాంబయ్య, బిజెవైమ్ రాష్ట్ర కళాశాల కన్వీనర్ మంద మహేష్ లు పేర్కోన్నారు. వరంగల్ బిజేపి ఎంపీ అభ్యర్థి రమేష్ నామినేషన్ సంధర్బంగా గణపురం మండలము నుండీ 300 మంది తరలివెళ్లారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ దేశంలో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అంతేగాక ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టడం ఖాయమని పేర్కోన్నారు. పదేళ్ల బిజెపి పాలనలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడం జరిగిందనీ అన్నారు. పేదల కోసం ప్రత్యేకంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందరికీ న్యాయం జరుగుతుంది అన్నారు. వరంగల్ బిజేపి ఎంపీ అభ్యర్థి రమేష్ ను అత్యదిక మెజార్టీ తో గెలిపించి, ఢిల్లీకి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మండల ప్రథాన కార్యదర్శి మాదాసు మోగిలి గౌడ్, చింతి రెడీ పాపిరెడ్డి, చందు, చెలుమల్ల ప్రవీణ్, శేషు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.