మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
నరేంద్ర మోడీ చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలకు,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై లింభ్య తాండ బి ఆర్ ఎస్ పార్టీ కి చెందిన యువ నాయకులు మిడ్జిల్ మండల బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షులు నరేష్ నాయక్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాల త్రిపుర సుందరీ సమక్షంలో బీజేపీ పార్టీలోకి చేరారు.వారిని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ వారిని బిజెపి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ చేరికలలో సికిందర్ నాయక్, నరేందర్ నాయక్, మురళి నాయక్, ఓంకార్ నాయక్, నాగరాజు నాయక్, సంతోష్ నాయక్, నాగేందర్ నాయక్ తదితరులు బి ఆర్ ఎస్ పార్టీని వీడి బిజెపి పార్టీలోకి రావడం జరిగింది