నడికూడ,నేటి ధాత్రి:
ఇటీవల తెలంగాణ గురుకుల్ సెట్ 2024 విడుదల చేసిన ప్రవేశ పరీక్ష ఫలితాలలో హనుమకొండ జిల్లా నడికూడ మండలం లోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 11 మంది ప్రవేశ పరీక్ష రాయగా తొమ్మిది మంది విద్యార్థులు ప్రవేశం పొందినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ తెలియజేశారు. ఈ సందర్భంగా అచ్చ సుదర్శన్ విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను చదువుకొని తమ లక్ష్యాలను చేరుకోవాలని ఈ సందర్భంగా వారితో అన్నారు. తాళ్లపల్లి హర్షిత, భీముడి హన్సిక, పర్షవేణి అఖిల, తాళ్లపల్లి సుశాంత్, శనిగరం చరణ్, మీనుగు హారిక, పట్టెం విక్కీ, దూడ హర్షవర్ధన్, బొల్లారం ప్రణీష్, విద్యార్థులు వివిధ గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పోలంపల్లి విజేందర్, నిగ్గుల శ్రీదేవి, విద్యా వాలంటీర్లు బాపురావు,
పర్షవేణి జ్యోతి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
చర్లపల్లి పాఠశాల ఆణిముత్యాలు
