దుమ్మగూడెం లో కొత్తపల్లి రూటులో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని తాజా మరియు మాజీ ఎమ్మెల్యేల హామీలు నీటిమీద రాతలేనా. పాయం సూటి ప్రశ్న.

భద్రాచలం నేటిదాత్రి

దుమ్మగూడెం మండలం బుధవారం నాడు నడికుడి కాళీమాత గుడి దగ్గర ఆదివాసి యువకులతో జరిగిన సమీక్షా సమావేశంలో గోడ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ దుమ్ముగూడెం మండలంలో అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కలిగి ఉన్నప్పటికీ వయా తునికిచెరువు నుండి రామచంద్రుని పేట చెరుపల్లి మారాయి గూడెం భీమవరం లచ్చి గూడెం ఆర్లగూడెం కాటాయగూడెం మీదుగా లక్ష్మీనగరం వరకు వెళ్ళుటకు ఆయా గ్రామాల ఆదివాసి ప్రజలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని జిఎస్పి ఆధ్వర్యంలో గతంలో ఆర్టీసీ డిఎం ఐ టి డి ఎ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి యున్నామని అన్నారు.
గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక వారం రోజులు ఆర్టీసీ బస్సు ఈ సర్కిల్ రోడ్డులో నడిపించి అర్ధాంతరంగా బస్సును నిలిపి వేషారన్నారు.
ఆర్లగూడెం మొదలుకొని రామచంద్రుని పేట వరకు గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు ఉన్నందున అన్ని వర్గాల ప్రజలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ప్రస్తుత ఎమ్మెల్యే మరియు మాజీ ఎమ్మెల్యేలకు గత అసెంబ్లీ ఎన్నికల ముందు వినతి పత్రాలు ఇచ్చామని బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఆదివాసుల ఓట్లను దండుకున్నారని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం ఆదివాసుల గ్రామాలకు ప్రధాన పార్టీల నాయకులు ఎమ్మెల్యేలు వస్తున్నారని మన యొక్క న్యాయమైన డిమాండ్ ను నెరవేరుస్తేనే ఓట్లు వేస్తామని కరాకండిగా చెప్పి నాయకులను నిలదీయాలని ఆదివాసి ప్రజానీకానికి గోండ్వానా సంక్షేమ పరిషత్తు పిలుపునిస్తుందని అన్నారు ఈ యొక్క సమావేశంలో ఎం నగేష్ కే రామకృష్ణ కే తేజ ఎస్ అభి ఎం సందీప్. జె చందు. జె విష్ణు. ఏ రమేష్. ఎం కామరాజు ఎం దుర్గారావు. కే రాంబాబు. ఎస్ శ్రీనివాస్. పి ఏడుకొండలు ఏ సాయి జె మహేష్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *