భూమి చనిపోబోతుందా….? ఎప్పుడు ఎలా………?

400 కోట్ల సంవత్సరాల భూగోళం మరో100 సంవత్సరాల అభివృద్ధి పేరుతో బీభత్సం కానుందా..!

సమస్త జీవకోటి భారాన్ని మోసే భూమి. నేడు కన్నీరు పెట్టుకుంటుంది.

ఈ అనంత విశ్వంలో జీవ సంచారం కలిగిన ఏకైక గ్రహం మన భూగ్రహం ఒక్కటే.

సకల కోటి ప్రాణులకు అనుకూలంగా మారుటకు ఎన్నో కోట్ల సంవత్సరాలు పట్టింది. అయితే భూమి ఎలా మార్పు చెందుకుంటూ వచ్చిందో అదే విధంగా మార్పు చెందుకుంటూ చనిపోతుంది అన్నది నిజం. అది ఎలా.?

ఓదెల చంద్రమౌళి సైన్స్ టీచర్.

చిట్యాల, నేటిధాత్రి :

ధరిత్రి దినోత్సవం సందర్భంగా భూమి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. సైన్స్ టీచర్ ఓదెల చంద్రమౌళి నేటి దాత్రితో పంచుకున్న విషయాలు
భూమి అంత గురించి మన మత గ్రంధాలు. భగవద్గీత, బైబిల్ ,ఖురాన్ , త్రిపీటకాలు ఇలా ఎన్నో. భూమి చావక తప్పదు అని చెప్తున్నాయి. వాటి ప్రకారం పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు అని. అదే విధంగా. నోస్ట్రో డామస్ మరియు బ్రహ్మంగారి కాలజ్ఞానo ప్రకారం కూడా ఈ భూమి అంతమవుతుందని తెలుస్తుంది మరి నిజంగా భూమి చనిపోతుందా? దీని గురించి మరి సైన్స్ ఎం చెప్తుంది చూద్దాం…సైన్స్ ప్రకారం 100% భూమి చనిపోతుంది అనేది వాస్తవం దీనికి గల కారణాలు సైన్స్ ప్రకారం ఎన్నో ఉన్నాయి.

1. భూమి పైన ఆహారపు గొలుసు నాశనం అవడం
2. భూమి యొక్క సరాసరి ఉష్ణోగ్రత పెరగడం
3. సౌర తుఫాను సంభవించడం
4. అష్టరాయిడ్స్ తోకచుక్కలు ఢీకొనడం
5. బ్లాక్ హోల్స్ భూమికి దగ్గరగా రావటం

ఇలా ఎన్నో ఇంకెన్నో……

*ఆహారపు గొలుసు నాశనం అవ్వడం..*

ప్రకృతికి సహజసిద్ధంగా ఉన్న జీవవైవిద్యం ఎంతో అవసరం సున్నితమైన ఈ ఆహారపు గొలుసు దెబ్బతింటే ప్రకృతిలో జీవజాతులు మనుగడకే ప్రమాదం జీవజాతులు నశించి పోవడం వలన మానవ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుకున్నవి. ఎందుకంటే ఈ భూమ్మీద ప్రతి ప్రాణి ఏదో ఒక ప్రాధాన్యతను కలిగి ఉంది ఇందులో ఏ జాతి కనుమరుగైన ఆహారపు గొలుసు దెబ్బతింటుంది ఇది అనేక ఇతర జాతుల వినాశనానికి దారితీస్తుంది ప్రస్తుతం కొన్ని రకాలైన జాతులు కనుమరుగైతూనే ఉన్నాయి.
ఇదిలా కొనసాగితే చివరికి మానవ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది భూమి మీద జీవజాతి అంతరించిపోయే ప్రమాదం దగ్గరలోనే ఉంది.

దీనికి కారణం కాలుష్యం మానవుడు విపరీతంగా వాడుతున్నటువంటి రసాయనాలు ..
భూమి ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితే భూమి అంతం తప్పదు.
మనకు తెలుసు ఈ భూమిపైన భూభాగం కేవలం 30 శాతం 70% నీళ్లు ఉన్నాయని అయితే ఈ 30% భూమిలో కూడా చాలా ఎక్కువ మొత్తము మంచుతో కప్పబడి ఉంది .ఈ కాలుష్యం వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ల వల్ల భూమి సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీల నుండి 17 డిగ్రీలకు మారితే భూమిపై ఉన్నటువంటి మంచి ఖండాలు కరిగి సముద్రమట్టం పెరిగి అందులో ఈ కాస్త ఉన్న భూమి మునిగిపోబోతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం కొన్ని దీవులు సముద్ర గర్భంలో కలిసిపోతూనే ఉన్నాయి. దీనికి కారణము మనం విచ్చలవిడిగా వాడుతున్నటువంటి శిలాజి ఇంధనాలు ఇవి గ్రీన్ హౌస్ గ్యాస్ లను క్లోరోఫ్లోరో కార్బన్లను రిలీజ్ చేసి భూమి యొక్క ఉష్ణోగ్రతను పెంచుతూ ఉన్నాయి. మరొక కారణం ప్లాస్టిక్ వాడకం వల్ల కాలుష్యం పెరిగి భూ వినాశనానికి దారి తీస్తుంది. ఇదే విధంగా జరిగితే మరి కొద్ది సంవత్సరాల్లోనే భూమి మొత్తం నీళ్లలో మునిగిపోక తప్పదు.

*సౌర తుఫాను సంభవించటం*

సూర్యునిలో జరిగే ఎటువంటి చర్యల ఆధారంగా మనకు కాంతిని వేడిని ఇస్తున్నాడు ఈ చర్యలకు హైడ్రోజన్ ఎంతో అవసరం రెండు హైడ్రోజన్ కలిసి హీలియం గా మారి ప్రక్రియనే కేంద్రక సంలీన చర్య అంటారు ఈ విధంగానే కాంతి ఉత్పత్తి అవుతుంది. దీనిలో జరిగేటువంటి చర్యలు కొన్నిసార్లు సౌర తుఫానుకు దారితీస్తున్నాయి ఈ సౌర తుఫాను వల్ల భూమిపైన అత్యధిక వేడిని ప్రసరింపజేసేలా చేస్తుంది. దీనివల్ల భూమి నాశనం తప్పదు.

*ఆస్ట్రాయిడ్స్ మరియు తోకచుక్కలు ఢీకొనడం*

మనకు తెలుసు ప్రతినిత్యం ఈ విషయం నుండి ఎన్నో ఆస్టరాయిడ్స్ భూమ్మీద తరచూ పడుతూనే ఉంటాయి ఒక్క భూమి మీదనే కాదు ప్రతిగ్రహం మీద పడుతూనే ఉంటాయి. ఒకవేళ కొన్ని పెద్దపెద్ద ఆస్టరాయిడ్స్. కనక భూమిని ఢీకొంటే భూమిపైన ఎంతో పెద్ద విస్పోటం జరుగుతుంది దీనివల్ల పెద్ద మొత్తంలో భూమి కాలిపోతుంది ఈ విధంగా కూడా జీవులు అంతరించే ప్రమాదం ఉంది కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం భూమి పైన డైనోసార్ జాతి ఉండేది ఇది ఇలాంటి ఆస్టరాయిడ్ల దాడి వల్ల నాశనం అయిపోయింది ఇదే విధంగా ఏదో ఒక రోజు అష్టరాయిడ్స్ వల్ల ఈ భూమి నాశనం తప్పదు అంటున్నారు శాస్త్రవేత్తలు.

*బ్లాక్ హోల్స్ భూమికి దగ్గరగా రావడం*

ఈ అనంత విశ్వంలో సూర్యుని సైతం మింగేటువంటి బ్లాక్ హోల్సే ఎన్నో ఉన్నాయి అనేది నిజం. బ్లాక్ హోల్ అంటే నక్షత్రం చనిపోయిన తర్వాత అది బ్లాక్ హోల్గా మారుతుంది దానికి గల అత్యధికమైన గ్రావిటీ వల్ల దానికి దగ్గరలో ఉండేటువంటి ద్రవ్యరాశి లాక్కుంటుంది ఇది సూర్యుడు కావచ్చు గ్రహాలు కావచ్చు వేటిని నా లాక్కునేటువంటి ఎబిలిటీ అని ఉంటుంది మన పాలపుంత గెలాక్సీ లోపల కూడా ఎన్నో బ్లాక్ హోల్స్ ఉన్నాయి ఇవి భూమికి కాస్త దగ్గరగా వస్తే భూమిని సైతం ఒకేసారి మింగేయగలుగుతాయి, ఏ విధంగా కూడా భూ అంతం తప్పదు అంటున్నారు.

ఇలా ఎన్నో ఎన్నెన్నో కారణాలవల్ల సైన్స్ ప్రకారం భూమి అంతం తప్పదు అనే మాట వినబడుతుంది అయినా కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే భూమిపైన కాలుష్యాన్ని తగ్గిస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించగలిగితే భూమి ఇంకా కొన్ని బిలియన్ సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంటుంది ఈ భూమిని మనం ముందు తరాలకు అందించాలి అంటే మనం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. అదేవిధంగా శిలాజి ఇంధనాల వాడకం తగ్గించాలి అప్పుడే భూమి ఇంకొన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతుంది.

చేయి చేయి కలుపుదాం ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలిద్దాం.

భూమిని మరికొన్ని సంవత్సరాలు బ్రతికిద్దాం మన ముందు తరాలకు స్వచ్ఛమైన భూమిని అందిద్దాం.

Odela chandmouli
9989224548

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!