గొల్లపల్లి నేటి ధాత్రి :
గొల్లపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలలో (1,2) ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత ఆధ్వర్యంలో ఈ. సి. సి. డే, స్కూల్ డే, గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించారు. ఈ స్కూలు కార్యక్రమంలో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల యొక్క తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి మంచి అలవాట్లు సంభాషణ ఆటలు పాటలు కథ సంభాషణ శాస్త్రీయ పరిజ్ఞానం మొదలైన కార్యక్రమాలు తల్లుల ఆధ్వర్యంలో పిల్లలతో చేపించి చూపించడం జరిగింది. పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రీ స్కూల్ విద్య ప్రాముఖ్యత బాల్యారంబదశ అతి ముఖ్యమైన భాగాలలో పూర్వ ప్రాథమిక విద్య ఒకటి ఇది ఐసిడిఎస్ కు మూల స్తంభం లాంటిది. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలను అంగన్వాడి కేంద్రాలలో చేర్పించవలెనని వారికి ఆట పాటల ద్వారా విద్యను అందించడం పిల్లలు అందరితో కలిసిమెలిసి ఉండటం బడికి రెడీ అలవాటు చేయడం జరుగుతుందని నర్సరీ త్రీ ప్లేసు, ఎల్ కె జి, ఫోర్ ప్లస్, యూకేజీ అంగన్వాడి టీచర్లు ప్రణాళిక ప్రకారం నిర్వహించడం జరుగుతుందని పిల్లలకు సంవత్సరంలో మూడుసార్లు అభివృద్ధి సూచికలు ఇవ్వడం జరుగుతుందని శారీరక సామాజిక వ్యక్తిగత భావోద్వేగ మేధో వికాసం భాష బడికి సంసిద్ధత మొదలైన కార్యక్రమాలు నిర్వహించి పిల్లలు పాల్గొంటున్న వారి స్థితిని గమనించి వారికి ఆగస్టు డిసెంబరు ఏప్రిల్ నెలల లో వీరిని ఆసెస్ చేసి వారికి స్టార్స్ ఇవ్వడం జరుగుతుందని అంగన్వాడి అమ్మ ఒడి లాంటిది తల్లులకు అవగాహన కలిగించనైనది. తల్లులతో కూడా ప్రీ స్కూల్ ప్రాముఖ్యత గూర్చి మాట్లాడించడం జరిగింది. పిల్లలతో ప్రీ స్కూల్ కార్యక్రమాలు తల్లుల సమక్షంలో చేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు మ్యాడవరం స్వప్న, మానాల తిరుమల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్, ఆయా లు, ఆశ కార్యకర్తలు, గర్భవతులు, బాలింతలు, తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు.