గుత్తికొయా గుంపును సందర్శించిన జిల్లా ఎస్పి
ములుగు జిల్లా నేటిధాత్రి
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపూర్ గుత్తికోయ గుంపును నిన్న ఉదయం జిల్లా ఎస్పి సందర్శించారు గుత్తికొయా ప్రజలతో జిల్లా ఎస్పి మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు ములుగు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరి అందిపుచ్చుకోవాలని అందుకోసం ములుగు జిల్లా పోలీస్ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంట్టుందని తెలియచేసారు గుత్తి కోయ గ్రామ పెద్దలతో యువకులతో ఎస్పి మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులకు, సంఘవిద్రోహులకు ఎవరు ఆశ్రయం కల్పించవద్దని స్వార్ధప్రయోజనాల కోసం ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అమాయక ప్రజలను రెచ్చకొడుతూ ప్రాణాలను బలిగొంటున్నారని వారిని విశ్వాసించారాదని మారుతున్న సమాజాన్ని బట్టి మారాలని ఎస్పి తెలియచేసారు అనంతరం ఎస్పి ఏఎస్పి గుత్తికొయా పిల్లలకు బిస్కెట్స్ అందచేశారు. గుత్తికొయా గుడాలలో గల సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటానని ఎల్లవేళలా పోలీసులకు సహకరించాలని తెలియచేసారు ఈ కార్యక్రమంలో ఎఎస్పి ఏటూరునాగారం డిఎస్పి ములుగు రవీందర్ సి ఐ ఏటూరునాగారం రాజు కన్నాయిగూడెం ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు