•ఎంపీపీ సహా, పలువురు మాజీ సర్పంచులు కాంగ్రెస్ లో చేరిక
నిజాంపేట: నేటి ధాత్రి ఏప్రిల్ 17
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనను చూసి కాంగ్రెస్ పార్టీ లో పలువురు ఎమ్మెల్యేలు,మంత్రులు,సీనియర్ బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్న క్రామంలో ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు తో సహా పలువురు మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ లో బుధవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలన చూసి పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరామన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా మాజీ సర్పంచులు అమర సేనా రెడ్డి, చల్మెడ నరసింహారెడ్డి,నాగరాజు, తిప్పనగుళ్ళ యాదగిరి లు కాంగ్రెస్ లో చేరారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ హయాంలో అభివృద్ధి శూన్యం అన్నారు. తాము సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే నిధుల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూడవలసి ఉండేదన్నారు. చాలా బిల్లు ఇప్పటివరకు రాలేవని వాపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే చేతుల మీదుగా పార్టీలు చేరామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.