నిజాంపేట, నీటి ధాత్రి, ఏప్రిల్ 17
మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన నీరటి వెంకటేష్ అనే వ్యక్తి నిన్న తేదీ 16- 4- 2024 మధ్యాహ్నం సమయంలో చేపలు పట్టడానికి వెళుతున్నట్టుగా ఇంట్లో చెప్పి వెళ్ళగా ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి అతని కోసం వెతుకుతూ చెక్ డాం వైపు తన బంధువులు వెళ్లి చూడగా అతను చెక్ డాం లో మునిగి చనిపోయి ఉండవచ్చని అనుమానంతో వెతకగా ప్రమాదవశాత్తు చేపలు పట్టే వల కాళ్లకు చిక్కుకొని చనిపోయినట్టుగా ఉన్నది అతని భార్య నేరటి కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడమయినది