శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం సూర్యనాయక్ తండాగ్రామంలో శ్రీరామనవమి పురస్కరించు కుని సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అన్ని దానాల లో కన్నా అన్నదానం గొప్పదని సూర్య యూత్ అధ్యక్షుడు లింగునాయక్అన్నారు.హనుమాన్ గుడి ఆవరణలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీఎంపిటిసి రెడ్డి నాయక్,అజ్మీరా దూదా,రఘు,బానోతు రాజు,మాలోతు భాష, సుధాకర్,సునీల్,వినోద్, సూర్యాయూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.