నేరాల నియంత్రణకే “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం”.

అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.

సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.

వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి.

*వేములవాడ రూరల్ నేటిధాత్రి*

నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది అని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఆదేశానుసారం మంగళవారం రోజున ఉదయం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని డిఎస్పీ అన్నారు.
ఈ సందర్భంగా డిఎస్పీ నాగేంద్రచరి మట్లాడుతు… ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ,గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత గ్రామలుగా చేయలనే జిల్లా ఎస్పీ ఉద్దేశ్యం తోనే ఈ యొక్క కార్యక్రమo నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు.
మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలల చే విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగిందని, యువత మాధకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో గంజాయి కి సంబంధించిన సమాచారం ఉంటే పోలీస్ వారికి అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి పేపర్లు లేని, సరైన నంబర్ ప్లేట్స్ లేని 40 ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగిందని సబంధించిన వాహన దారులకు సరైన పత్రలు చూపించి వాహనాలు తీసుకవేళ్ళవచ్చు అన్నారు.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు.
గ్రామాల్లో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసుల కు ఫోన్ చేయాలని లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేసినాచో వెంటనే చర్యలు చేపడతాం అన్నారు.
గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో,నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 ట్రోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమాo తరుచుగా నిర్వహిస్తామని,చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ మారుతి ,పోలీస్ సిబ్బంది , డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *