ఎనగండ్ల క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో

– ఘనంగా అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు…

– అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కొల్చారం ఎంపిపి మంజుల కాశీనాథ్….

-మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన అంబేద్కర్…

– ఎంపీపీ మంజుల….

కొల్చారం,( మెదక్) నేటి ధాత్రి:-

కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామంలో క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొల్చారం ఎంపీపీ మంజుల కాశీనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల కాశీనాథ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి ,పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల కాశీనాథ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఉన్నత చదువులు చదివి ప్రపంచ మేధావుల్లో ఒకరిగా పేరుగాంచి ఆర్థికంగా,సామాజికంగా ఎంతో వెనుకబడిన అనగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పోరాడి తన మేధా సంపత్తితో తొలి భారత క్యాబినెట్లో న్యాయశాఖ, మంత్రిగా సామాజిక న్యాయం కోసం అనేక సంస్కరణలు తీసుకు వచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆమె అన్నారు. ఆయన అడుగు జాడల్లో సామాజిక అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని అన్నారు. మహనీయుల జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలని, అంబేద్కర్ యువతకు మార్గదర్శనం అన్నారు. దేశ ప్రజలందరికి సమాన ఓటు హక్కు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్, ,క్రాంతి యువజన సంగం అధ్యక్షులు గోపాల్ మరియు మాజీ ఉప సర్పంచ్ సుమలత బాబు, సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మి నర్సింహా గౌడ్, మన్నే సుభాష్, కొరబోయిన శివ ప్రసాద్, లింగం క్రాంతి యువజన సంఘం యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *