పరకాల నేటిధాత్రి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ 134వ జయంతి సందర్బంగా కాకతీయ విశ్వవిద్యాలయం లో దూర విద్య కేంద్ర ప్రాంగణం లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.అనంతరం 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య డాక్టరేట్ పొందిన పరిశోధకులు బొల్లారం సంజీవ్ కు జ్ఞాపికను బహుకరించి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ఒప్పంద అధ్యాపకురాలు డాక్టర్ లక్ష్మి, ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల, విశ్రాంత ఆచార్యలు పి.కృష్ణమాచారి,ఆచార్య చింతకింది సమ్మయ్య,పలువురు బోధన,బోధనేతర సిబ్బంది. పరిశోధకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బొల్లారం సంజీవ్ కు ఘన సత్కారం
