వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి పట్టణంలో మిగిలిపోయిన రోడ్ల విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ జన సమితి అధ్యక్షులు ఖాదర్ పాషా సీపీఐ నేత గోపాలకృష్ణ 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ గంధం నాగరాజ్ గంధం సుమన్ 15వ వార్డు ప్రజలు బండారు భాస్కర్ చికెన్ సెంటర్ శీను యాదమ్మ భాగ్యలక్ష్మి బండార్ మధు కోరారు వారు మాట్లాడుతూ రామ టాకీస్ నుంచి ఒక సైడ్ బీటీ రోడ్ ఒక సైడు బీటి రోడ్డు వేయకుండా వదిలి వేశారని గుంతలు ఉన్నాయని యూనియ న్ బ్యాంకు వరకు అదే విధంగా ఉన్నదని రోడ్డు ప్రమాదకరంగా ఉండడంవల్ల ద్విచక్ర వాహనాలు దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే బీ టి రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి జిల్లా కలెక్టర్ స్పందిం చి మిగిలి పోయిన బిటి రోడ్డు ను వేయించాలని వారు విజ్ఞప్తి చేశారు పానగల్ రోడ్డు పాలిటెక్నిక్ రోడ్ కొత్తకోట రోడ్డు రోడ్ల విస్తరణ చేయకపోవడంతో రోడ్డు చిన్నగా ఉండటంవల్ల ప్రయాణికులు వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీజేఎస్ అధ్యక్షులు ఖాదర్ బాషా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో వచ్చిన నిధులను వాపస్ పోయాయని ఆ యొక్క జీవో ను మార్చి వెంటనే రోడ్ల విస్తరణ చేయాలని నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు
మిగిలిపోయిన రోడ్ల విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి ఐక్యవేదిక
