భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నటువంటి పోరిక బలరాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ భద్రాచల పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా భోగాల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని, ఎన్నికల ముందు చెప్పిన విధంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసి తెలంగాణ ప్రజల మన్నులను పొందాలని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజల మనిషి మాజీ, మాజీ కేంద్ర మంత్రివర్యులు పోరిక బలరాం నాయక్ నిఅధిక మెజార్టీతో గెలిపించుకోవడం ద్వారా కేంద్రం నుంచి కూడా అభివృద్ధిని తీసుకొని వచ్చి నియోజకవర్గాన్ని సర్వనా సుందరంగా అభివృద్ధి చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో ఆయన ప్రజలకు వివరించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాస మల్ల రాము,అన్నెం రామిరెడ్డి, ఉబ్బ వేణు, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.