మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు అనే కథనానికి మహబూబ్ నగర్ జిల్లా ఉన్నత అధికారులు స్పందించారు. రెండు మూడు నెలలుగా మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతుండడంతో మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. ఎట్టకేలకు నేటి ధాత్రి కథనానికి మిషన్ భగీరథ అధికారులు స్పందించి మిషన్ భగీరథ పైప్ లైన్ బాగు చేయించారు. అది చూసిన పలు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెలలో భానుడి తాపానికి తట్టుకోలేక ప్రజలు విలవిలలాడకుండా మండలంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పై ఎలాంటి సమస్య వచ్చినా 24 గంటల్లో మేము అందుబాటులో ఉంటామని మిషన్ భగీరథ ఎఈ సాయి ప్రశాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.