
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంపీ అభ్యర్థి సి డబ్ల్యూ సి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ చల్లా వంశీ చంద్ రెడ్డి, జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి దుశాంత్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, పాల్గొన్నారు. శ్రీ చెల్లా వంశీ చంద్ రెడ్డి మాట్లాడుతూ,ఈ ఎన్నికలలో జడ్చర్ల నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి 50వేల మెజారిటీ ఇస్తామని అనిరుద్ రెడ్డి అన్న మాట ఇచ్చారన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే మాటను నెరవేర్చే బాధ్యత కార్యకర్తలదే ననిఅన్నారు. అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన విధంగానే మహబూబ్ నగర్ ఎంపీగా నన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్నివేళలా అందుబాటులో ఉంటామని మీకు సేవ చేసే బాధ్యత మాదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జహీర్ అక్బర్,వాసు యాదవ్, మండల అధ్యక్షులు నీరేటి రామచంద్రయ్య, తులసి రామ్ నాయక్, కొల్లూరు కాజా పాషా, అమ్మపూర్ నర్సింలు, అంతయ్య, వివిధ గ్రామాల నాయకులు పెద్దలు కార్యకర్తలు పాల్గొన్నారు.