# భారాస మండల కమిటీ అధ్వర్యంలో నిరసన
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితో గత ప్రభుత్వ హయాంలో బిటి రోడ్లు మంజూరై పనులు ప్రారంభం కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పనులను ప్రారంభం చేయాలని భారాస పార్టీ నర్సంపేట మండల కమిటీ అధ్యక్షుడు నామాల సత్యనారయణ ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మండల అధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి నుండి ధబ్బిడిపేట వరకు బిటి రోడ్డు, జంగాలపల్లి నుండి 365 జాతీయ రహదారి వరకు బిటి రోడ్డు,
చింతగడ్డ నుండి రాజుపేట వరకు బిటి రోడ్డు, బాంజిపేట నుండి ఇటుకాలపల్లి వరకు బిటి రోడ్డు,నాగూర్లపల్లి నుండి నారాయణ తండా వరకు బిటి రోడ్డు,
బాంజీపేట నుండి బోజ్యనాయక్ తండ వరకు బిటి రోడ్డు,నాగుర్లపల్లి నుండి కమలాపురం వరకు బిటి రోడ్డు,
నాగుర్లపల్లి నుండి ఎన్టీఆర్ నగర్ వరకు బిటి రోడ్డు,కమ్మపెళ్లి నుండి మహమ్మదాపురం వరకు బిటి రోడ్డు,
దాసరిపల్లి నుండి బాంజీపేట వరకు బిటి రోడ్డు, శివాని పబ్లిక్ స్కూల్ నుండి రామవరం వరకు బిటి రోడ్డు పనులు ఆగిపోవడం వలన ప్రస్తుత ఎమ్మెల్యే వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం తరపున ఈ ఎండా కాలంలోపే పనులు ప్రారంభం అయ్యేలా కాంట్రాక్టర్లు, అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. ఎండాకాలం తర్వాత వర్షాకాలంలో పనులు చేయడం సాద్యం కాదని తద్వారా నిధులు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహ రాములు, క్లస్టర్ బాధ్యులు కోమండ్ల గోపాల్ రెడ్డి, మోతే పద్మనాభరెడ్డి, తాళ్లపల్లి రాంప్రసాద్, భూక్య వీరన్న, కడారి కుమారస్వామి, స్థానిక సర్పంచ్ మండల రవీందర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు లకిడే రాజేశ్వరరావు, మాజీ ఉపసర్పంచ్ జమండ్ల చంద్రమౌళి, కన్నెబోయిన రాజు, ఉల్లిరావు సాంబయ్య, ఉల్లిరావు నరసింగం,సొనబోయిన కుమార్, స్థానిక రైతులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.