మంచిర్యాల నేటిదాత్రి:
ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత, బిసి వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులతో కలిసి మహాత్మ జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులకు మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది. 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించి అస్పృశ్యుల అణగారిన వర్గాలకు చైతన్యం తీసుకురావడానికి 1848వ సంవత్సరంలో పాఠశాలలు నిర్మించి విద్యను నేర్పించి వారిలో చైతన్యం తీసుకొచ్చి ప్రజల చేత మహాత్ముడు అని పిలిపించుకున్న గొప్ప వ్యక్తి మాత్మ జ్యోతిరావు పూలే, ఈయన బాల్యవివాహాలు, రద్దు చేయడానికి మరియు వితంతువులకు పునర్వివాహం చేసుకోవడానికి చైతన్య కలిగించి మునువాద సంస్కృతి నుండి విముక్తి కలిగించిన గొప్ప మహానుభావులు, అదేవిధంగా కుల వివక్షకు తావు లేకుండా సమ సమాజాన్ని నిర్మాణ కోసం పౌరోహిత్యం దాని బండారం, గులాంగిరి, తృతీయ రత్న, పుస్తకాలు రచించి అణగారిన ప్రజలో చైతన్యం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు జిల్లపల్లి వెంకటేశం, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గొడిసెల దశరథం, ఎం ఈ ఎఫ్ రాష్ట్ర నాయకులు మోతే పోచయ్య, ఎంఎస్పి నియోజకవర్గ నాయకులు చెంచు శంకర్ వర్మ, ఎమ్మార్పీఎస్ నాయకులు గడ్డం సత్యం, మాదిగ ఇండస్ట్రియల్ ఛాంబర్ జిల్లా ఇన్చార్జి కుంటాల శంకర్, ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక నాయకులు గుడిసెల రాజారాం, అర్నకొండ నరేష్, చిప్పకుర్తి నవీన్, లు పాల్గొన్నారు