చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి* వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ కాలంలో సామాజిక ఉద్యమాకారుడు అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని భారత జాతిపిత చదువుల తండ్రి మహాత్మ జ్యోతి రావు పూలే అన్నారు. ఆంగ్లేయులు, అగ్రవర్ణ భూస్వామ్య పెత్తందారులు ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వారిని కుల వివక్షత బానిసత్వం. అవమానాలు హింసలు అంటరాని తనం మూఢనమ్మకాలు అస్పృశ్యత చదువు సంస్కారం తెలియని ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టారని తెలిపారు .చదువు సంస్కారం తెలియని ప్రజలకు విద్యా ను అందించాలని తన భార్య సావిత్రి భాయిపూలే ద్వారా మొట్ట మొదటి పాఠశాలను ఏర్పాటు చేశారని చెప్పారు. మహిళలకు, ప్రజలకు చదువు సంస్కారం తెలియని వారిని చైతన్య వంతులను చేయడానికి ఎంతో క్రృషి చేశారని, వారిని ముందుకు నడిపించిన గొప్ప సంఘసంస్కర్త అన్నారు. దేశానికి ప్రజలకు వారు చేసిన సేవలు మరువలేనివన్నారు. నేటి తరం వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్యమల్లయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య దుబ్యాల ఎంపిటిసి సంగి రవి, అంబెడ్కర్ యువజన సంఘం జిల్లా సాంస్కృతిక కార్యాదర్శి జన్నే యుగేందర్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు అండాలు అనిల్ అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి మ్యాదారి సునీల్ నాయకులు పుల్ల ప్రతాప్ మాసు రమేష్ గుర్రపు రాజమౌళి గుర్రం తిరుపతి గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మాసు పవన్ దొడ్డి ఉషాకిరణ్ పుల్ల సతీష్ సంజయ్ శివ గడ్డం సదానందం ఆరేపెల్లి లక్ష్మణ్ జిల్లా ప్రచార కార్యాదర్శి గుర్రపు రాజేందర్ మండల నాయకులు గురుకుంట్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.