మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
భారతీయ జనతా పార్టీ పాలమూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సాహితి రెడ్డిని మహిళా మోర్చా పాలమూరు జిల్లా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు పి. శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సాహితి రెడ్డి మాట్లాడుతూ,నాపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చిన పెద్దలకు తనకు అవకాశం ఇచ్చిన పార్టీకి రుణపడి ఉంటానని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణమ్మ గెలుపు కోసం జిల్లా మహిళా మోర్చా తరపున కృషి చేస్తానని తెలిపారు. ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని వెల్లడించారు. పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాలకు పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తానని తెలియజేశారు. నాకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర,జిల్లా నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.