
దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న ప్రజలు!!
ఎండపల్లి నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్ల కోట గ్రామంలో కొత్త రోడ్డు, సమీపంలో డ్రైనేజీ లేక మురుగునీరు,పైపుల ద్వారా మొత్తం కాలువలో చేరి ఏరులై పారుతుంది, కెనాల్ నుండి నీరు రైతులకు పంటల కోసం వెళ్తున్న క్రమంలో చెత్తాచెదారం మొత్తం డ్రైనేజీ నీరు మొత్తం కాలువలో చేరి పంట పొలాలకు వెళితే పంటలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది, అలాగే వచ్చే వర్షాకాలం వర్షాలు పడి డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు మొత్తం రోడ్లపైకి వచ్చి ,దుర్వాసన వెద జల్లె అవకాశం ఉన్నది, తద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేసేలా సిబ్బందికి సూచనలు చేసి చెత్తాచెదారం తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు ,వెంటనే గ్రామపంచాయతీ సిబ్బంది కాలువలో చెత్తాచెదారం తొలగించి ఎలాంటి వ్యాధులు రాక ముందే , చెత్త చెదారం తొలగించి,డ్రైనేజీ వ్యవస్థను ,శుభ్రంగా ఉంచేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు, ఇట్టి విషయమే గ్రామపంచాయతీ కార్యదర్శి కుమార్ వివరణగుల్లకోట గ్రామంలో,పై అధికారుల సహాకారంతో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం కొన సాగుతుంది , 2-3 రోజుల్లో గ్రామంలో అన్ని కాలనీల్లో శానిటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాం,స్వచ్చ గ్రామం గా చేయడమే లక్ష్యం గా పని చేస్తాం అని తెలిపారు