ముత్తారం :- నేటిధాత్రి
గత నాలుగు రోజుల నుంచి ముత్తారం మండల కేంద్రంలో స్థానిక మండల స్థాయి కళాకారులతో చిరుతల రామాయణం ప్రదర్శన ఆధ్యాత్మికంగా కనువిందు చేస్తుంది.ముత్తారం గ్రామ ప్రజలే కాకుండా సమీప గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి ప్రదర్శనను తిలకిస్తున్నారు.ఈ మేరకు ఆదివారం సాయయంత్రం జరిగిన ప్రదర్శనలో పలు ఘట్టాలను నిర్వహించారు.ఆధునిక ప్రపంచంలో యువత సెల్ఫోన్లకు బానిసలుగా మారుతూ చెడు మార్గాల్లో నడుస్తున్నారని,వారిని సన్మార్గంలో తీసుకెళ్లేందుకు, ఈ చిరుతల రామాయణం ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ప్రదర్శనలో రాముని పాత్రగా పొన్నం కుమార్,సీతగా మద్దెల దివాకర్,లక్ష్మణుడి గా నిమ్మతి రాజేందర్, హనుమంతుడి గా పరికిపండ్ల మొగిలి,గృహడు గా గట్టు మహేష్ ఆకర్షణీయంగా ఆకట్టుకున్నారు.