గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో సోమవారం సోమవతి అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరేష్ ఆయనను సాధారంగా ఆహ్వానించి అభిషేకం అర్చన నిర్వహించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.