
# జిల్లా అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి.
# అప్పలరావుపేట గ్రామంలో క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా పరిశీలన.
నెక్కొండ,నేటి ధాత్రి :
వేసవిలో మంచినీటి ఎద్దడి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున గ్రామాల్లో ప్రజలకు నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి ఆదేశించారు.సోమవారం వరంగల్ జిల్లా నెక్కొండ ఎంపీడీవో కార్యాలయంలో సంబంధిత అధికారులతో మండలంలో గ్రామాల వారిగా వేసవిలో తాగునీటి సరఫరా కొరకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.అనంతరం నెక్కొండ మండలంలోని అప్పాలరావుపేట గ్రామంలో క్షేత్రస్థాయిలో అదనపు కలెక్టర్ అధికారులతో కలిసి
మిషన్ భగీరథ ఆధ్వర్యంలో సరఫరా అవుతున్న నీటి సరఫరా తీరును పరిశీలించారు. మిషన్ భగీరథకు ప్రత్యామ్నాయంగా అవసరమైనచో గ్రామంలో గల వ్యవసాయ బావిని పరిశీలించి ఏప్పటికప్పుడు శుభ్రంతో పాటు క్లోరినేషన్ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి,వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఉష దయాల్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మిషన్ భగీరథ ఏఈ రాజేష్, ఎంపీఓ సతీష్, విఎస్ ఓలు,పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.