
చేర్యాల నేటిధాత్రి…
జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని చేర్యాల ప్రాంత న్యాయవాదుల అడ్ హక్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి చేర్యాల కోర్టు ప్రారంభోత్సవానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేర్యాల కోర్టు ప్రారంభోత్సవానికి కావలసిన సంపూర్ణ సహకారం అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేర్యాల ప్రాంత న్యాయవాదుల అడ్ హక్ కమిటీ కన్వీనర్ ఆరేళ్ల వీరమల్లయ్య, కో-కన్వీనర్లు గాజుల రవీందర్, మెరుగు రమేష్ మరియు న్యాయవాదులు గూడెపు శ్రీధర్, నీరటి వెంకటేష్, నల్లగొండ సంతోష్, మోకురాజు రెడ్డి, దర్శనం ప్రశాంత్, గుస్క వెంకటేష్, పొన్నం సురేష్ తదితరులు పాల్గొన్నారు.