
నర్సంపేట టౌన్ , నేటిధాత్రి :
బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన అక్షర ద స్కూల్ మరియు బిట్స్ స్కూల్ లలో సోమవారం మిని ఉగాది వేడకను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ.రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ ఏ.వనజ
మేడమ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఉగాది పండుగ రోజు నుండే కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుందని అన్నారు.తెలుగు వారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి తెలిపారు.ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనదని చెప్పారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను,కష్ట సుఖాలను
సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంనది తెలిపారు.
ఈ సందర్భంగా అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఊడుగుల జ్యోతి గౌడ్, సెక్రెటరి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి,సి.ఎ వొ సురేష్,ఉ
పాధ్యాయ బృందం,విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.