
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. 6ఎప్రిల్1980న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పడి నేటికీ నలబై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామంలో భాజపా జెండా ఆవిష్కరణ చేసి స్వీట్లు పంపిణీ, తదనంతరం టిఫిన్ బైటెక్ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జ్, బిజెపి మాజీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కట్టా రవీందర్, బూత్ అధ్యక్షులు మునిగంటి శ్రీనివాస చారి, మండల శేఖర్, నీలం రవి, డాక్టర్ శీను, బసవేని శేఖర్, సాయిల అశోక్, యామ లచ్చయ్య, మండల వెంకటనర్సు, ఓరుగంటి మహేష్, తదితరులు పాల్గొన్నారు.