# వాహనాల పార్కింగ్ టెండర్ పూర్తయిన పైసా వసూల్..
# టెండర్ రద్దు ప్రకటనలకే పరిమితమా..?
# అందరికీ మామూళ్లు ఇచ్చినం.. టెండర్ గడువుతీరినా డబ్బులు వసూల్ చేస్తాం..
# వాహనాల పార్కింగ్ లో ఎవరివాటా ఎంతా..?
# చోద్యం చూస్తున్న పంచాయితీ అధికారులు..!
వరంగల్ జిల్లా ప్రతినిధి , నేటిధాత్రి :
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో పంచాయతీ అధికారులు చేతులెత్తేయడంతో ప్రైవేట్ కొనసాగుతున్నది. జాతరకు వెళ్లే భక్తుల నుండి వాహనాల పార్కింగ్ పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తూ వారు ఆడింది ఆట పాడింది పాటగా మూడు మూడు పువ్వులు ఆరుకాయలుగా వారి దందా సాగుతున్నది. వాహనాల వాహనాల పార్కింగ్ కోసం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన టెండర్ వ్యవహారంలో ఆ టెండర్ దక్కించుకున్న ఒక ప్రైవేటు వ్యక్తి గ్రామపంచాయతీ అధికారులు నిర్ణయించిన రేట్లకు విరుద్ధంగా నిర్వహించడం పట్ల నేటిధాత్రి పతనానికి స్పందించిన సంబంధిత మండల పంచాయతీ అధికారి వారి టెండర్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ పంచాయతీ అధికారుల మాటలను లెక్కచేయకుండా అదే రీతిలో అధిక చార్జీలు వసూలు చేశారు. అయినప్పటికీ వారి టెండర్ గడువు ఈ నెల 4 వరకు ముగిసింది. కానీ టెండర్ వేసిన నిర్వాహకులు వారి అక్రమ వసూళ్ల దందాను అదే స్థాయిలో కొనసాగిస్తూ జాతరకు వచ్చే భక్తులను భయాందోళనలకు గురి చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.
# # వాహనాల పార్కింగ్ టెండర్ పూర్తయిన పైసా వసూల్…
కొమ్మల జాతర లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వెళ్తున్న భక్తుల నుండి ప్రైవేట్ వ్యక్తులు వాహనాల టాక్సీల పేరుతో దోపకాలకు పాడుతున్నారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. వాహనాల పార్కింగ్ గడువు ఈనెల 4తో పూర్తయినప్పటికీ కొందరు ప్రైవేటు వ్యక్తులు జాతర చుట్టూ ఉన్న ప్రధాన రహదారుల వద్ద కాపుగాసి బెదిరింపులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు.
# # టెండర్ రద్దు ప్రకటనలకే పరిమితమా..?
జాతరలో వచ్చే భక్తుల నుండి వాహనాల పార్కింగ్ పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని నేటి ధాత్రిలో వచ్చిన కథనం ప్రకారం ఆ టెండర్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన మండల పంచాయతీ అధికారి ప్రభాకర్ మాటలు ప్రకటనల వరకే పరిమితమయ్యాయని భక్తులు ప్రజలు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అధికారుల మాటలు పెడచెవిన పెట్టని సదరు వ్యక్తిపై చర్యలు ఉండవా అని ప్రశ్నిస్తున్నారు.
# అందరికీ మామూళ్లు ఇచ్చినం… టెండర్ గడువుతీరినా డబ్బులు వసూల్ చేస్తాం..
కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతరలో వాహనాల పార్కింగ్ టెండర్లు రద్దు మరియు గడువు పూర్తయినప్పటికీ డబ్బులు ఎలా వసూలు చేస్తున్నారని దర్శనానికి వెళ్తున్న భక్తులు ప్రశ్నించగా ఇక్కడ మేము అందరికీ మామూళ్లు ఇచ్చినం.. మా ఇష్టం వచ్చినట్లుగా నిర్వహిస్తాం. మీరు జాతర లోపలికి వెళ్లాలంటే పార్కింగ్ ఫీజు కచ్చితంగా కట్టాల్సిందే అని బెదిరింపులకు గురి చేస్తున్నారని దర్శనానికి వచ్చిన భక్తుడు బానోతు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.స్థానిక పంచాయితీ కార్యదర్శికి సమాచారం ఇచ్చిన కూడా నేను ఏమి చేయలేను అని అది వారి ఇష్టం అని దురుసుగా సమాధానం చెప్పడానికి భక్తుడు రమేష్ ఆరోపించారు.
# చోద్యం చూస్తున్న పంచాయితీ అధికారులు..!
లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో ప్రైవేట్ వ్యక్తులు వాహనాల పార్టీ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న స్థానిక పంచాయతీ కార్యదర్శి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారని భక్తుల ఆరోపిస్తున్నారు. భక్తి కోసం వస్తున్న భక్తుల వద్ద నిలువు దోపిడీ చేస్తు ఇంత దందా జరిగినప్పటికీ అధికారులు వారి పట్ల చర్యలు తీసుకోకపోవడం పట్ల అంతర్యం ఏమిటి అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
# # వాహనాల పార్కింగ్ లో ఎవరివాటా ఎంతా..?
వాహనాల పార్కింగ్ పట్ల అధికంగా వసూలు చేస్తున్న ఆ టెండర్ వ్యక్తిపై పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని భక్తులు, ప్రజలు అడుగుతున్నారు. గడు దాటిన తర్వాత డబ్బులు ఎలా వసూలు చేస్తారని భక్తులు అడిగితే మేము ఎవరికీ ఇచ్చే మామూళ్లు వారికి ఇస్తున్నాము మీరు కచ్చితంగా పార్కింగ్ చార్జి చెల్లించాల్సిందే అని భక్తులను డిమాండ్ చేస్తూ భయాందోళనకు గురి చేయడం పట్ల అసలు రహస్యం ఏమిటి అని అలాగే ఈ దందాలో ఎవరి వాటా ఎంత అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర లో దర్శనం కోసం వస్తున్న భక్తుల వద్ద నుండి పార్కింగ్ చార్జీల పేరుతో నిలువు దోపిడీ చేయడం పట్ల సంబంధిత అధికారుల నిర్లక్ష్యం అద్దం పట్టినట్టు ఉన్నదని ఆరోపిస్తున్నారు. అందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజలు ఆరోపిస్తున్నారు.