
చిన్నారిని ఆశీర్వదించిన సిరికొండ..
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండలంలోని జూకల్ గ్రామాల్లో నిర్వహించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేదమంత్రోచ్ఛారణాల మధ్యన నిర్వహించిన శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి సీతారామ లక్ష్మణ హనుమంత సమేత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో తెలంగాణ తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి పాల్గొని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న మధుసూదనాచారికి గ్రామస్తులు బాణాసంచాను పేల్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించి దేవత మూర్తులకు సంబంధించిన ప్రతిష్టాపన యంత్రాలను మధుసూదన చారి చేత గద్దెలపై పెట్టించారు ఆయన చేతుల మీదుగా విగ్రహాలను ప్రతిష్టించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వరుడు సీతారామ లక్ష్మణ సమేత అనుగ్రహం జూకల్లు గ్రామంలో మెండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దైవ కృపను పొంది గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల వారు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యములతో భోగ భాగ్యాలతో తులతూగలని ఆయన భగవంతున్ని వేడుకున్నారు.. అనంతరం మండలం లోని నైన్ పాక కు చెందిన పత్రిక విలేకరి మొకిడి సతీష్ మమత ల కూతురు సారీ పంక్షన్ లో పాల్గొని చిన్నారి స్ఫూర్తి ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లో బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతల రమేష్ జెంబుల చెంద్రమొగిలి చిదిరాల స్కైలాబ్ తణుకు మధు కర్రే అశోక్ రెడ్డి కన్యాబోయిన అశోక్ గొల్లపల్లి రాజు చెంద్రమోగిలి మాజీ సర్పంచ్ మహేందర్, రవి పువ్వాటి హరికృష్ణ అరవిందరెడ్డి ఉప్పుల కిరణ్ గురుకుంట్ల కిరణ్ వేణువంక శ్రీదేవి, రాయిని శ్రీకాంత్ పుష్పక్క ఎండీ జిలాని వెంకటేష్ నాయకులు రాజిరెడ్డి బిక్షపతి నర్సింగరావు వెంకట్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.