రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య
చిట్యాల, నేటిధాత్రి :
దేశంలో సమసమాజ స్థాపనకై క్రృషి చేసిన క్రృషీవలుడు మాజీ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని తెలంగాణా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య* అన్నారు.
శుక్రవారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య చిత్ర పటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు దలితబాందవుడు గొప్ప సంఘసంస్కర్త దేశానికి అనేక సేవలు అందించిన భారత దేశ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యాదర్శి గుర్రపు రాజేందర్ మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ ఉపాధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ మండలనాయకులు గురుకుంట్ల కిరణ్ పాముకుంట్ల చందర్ గుర్రపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.