కాంగ్రెస్ పార్టీ మాదిగల ద్రోహి

# కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

# ములుగు జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యాంబాబు మాదిగ మండల అధ్యక్షులుదూడపాక రాజు మాదిగ

ములుగు జిల్లా నేతిధాత్రి

ములుగు జిల్లా కేంద్రంలో మహాజన సోషలిస్ట్ పార్టీ ములుగు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాజన సోషలిస్టు పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు మడిపల్లి శాంబాబు మాదిగ హాజరై మాట్లాడుతూ ములుగు జిల్లా సెంటర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎనుముల రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను సామాజిక ఉద్యమాల పితామహుడు, మహాజన సూర్యుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, దండోరా ఉద్యమ దళపతి మాన్యులు మంద కృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాల మేరకు ములుగు జిల్లా చౌరస్తాలో దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేయడం జరిగింది తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉంటే ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించకపోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మాలల పార్టీగా మారింది ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తన మాల కులస్తులకే ఎంపీ సీట్లు కేటాయిస్తున్నారు అని వారు మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా మాల చేతిలో బందీ అయ్యాడు. మాదిగ జనాభా 75 శాతం ఉన్న ఇవ్వవలసిన మూడు స్థానాలలో కనీసం రెండు సీట్లు కూడా కేటాయించకుండా మాదిగలను అనిచివేతకు గురి చేస్తున్నారు. తన ప్రారంభ రాజకీయ జీవితం నుంచి మాదిగలకు నేను అండగా ఉంటా వారి సామాజిక న్యాయాన్ని గెలిపించే దిశగా అడుగులు వేస్తాం అంటూ మా సామాజిక వర్గాల ఓట్లను తన పార్టీ వైపు మలుచుకునేందుకే ఎన్నో ఎత్తుగడలు వేసినట్టుగా కనిపిస్తుంది.నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎదిగిన మాదిగలకు సామాజిక న్యాయాన్ని అందిస్తాము అండగా ఉంటాము అన్నమాట మరిచి నేడు మాదిగలకే సీట్లు లేకుండా చేసి , మాదిగ నాయకులను ఊరిస్తున్న వైనం కనబడుతుంది. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి మా మాదిగల అణచివేతకు గురి చేస్తున్న మీ కాంగ్రెస్ పార్టీని ప్రస్తుత పార్లమెంట్ ఎలక్షన్ ల లో చిత్తు చిత్తు గా ఒడిస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మరాఠీ రవీందర్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు వావిలాల సాంబశివరావు మాదిగ, సబ్ డివిజన్ ఇంచార్జ్ ఎంపెల్లి శంకర్, గోవిందరావుపేట మండలం అధ్యక్షులు తోకల రాంబాబు మాదిగ, జిల్లా నాయకులు బొచ్చు అరవింద్ మాదిగ పడిదల జగన్ మాదిగ
తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!