
ప్రజా సేవకులు గా జనం గుండెల్లో నిలిచిన వైనం!! కడసారి వీడ్కోలు పలికేందుకు తరలి వచ్చిన జనం!!!
ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన లింగంపెల్లి చంద్రయ్య (చందు),బుధవారం రోజున తన నివాసంలో హఠాన్మరణం చెందారు, వృత్తి రీత్యా ఉపాధ్యాయుడుగా,జనం కోసం స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపకులు గా,ఎందరికో ఆదర్శంగా,మలి విడత తెలంగాణ ఉద్యమం నుండి మొదలుకొని,యువత, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరి మనసు కదిలించిన మీరు లేరనే బాధ మాత్రం అభిమానుల్ని వెంటాడుతుంది, ఒక ఉపాధ్యాయునిగా సమాజ నిర్మాణానికి నాంది పలుకుతూనే,సేవకుడిగా మీరు చేసిన సేవలు తరాలు మారినా మరిచిపోనివి జనం కోసం అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి,వ్యవస్థాపకులు గా జనం మధ్యలో ఉండి,ఊరికి,ప్రజలకు మీరు చేసిన సేవలు అంత ఇంతా కాదు, మీ సేవలు చిన్న పిల్లలకు సైతం వారి భవిష్యత్ తరానికి నాంది పలికే విద్యను అందించి చాలా మంది కుటుంబాల పిల్లలకు బాసటగా నిలిచి,ఆదర్శ గురువు అయ్యారు, ఎన్నో ఏళ్లుగా ప్రజలకు చలివేంద్రం తో చల్లని నీరు అందించి, ప్రజల్లో దాతగా దాహం తో ఉన్నవారి ప్రతి ఒక్కరి కడుపునిండా చల్లబ రిచిన గొప్ప దయ గుణం మరువలేనివి పిల్లల మదిలో జీవితానికి ఉపయోగ పడే పరీక్షలకు పరీక్ష ప్యాడు అందించి, గురుకులంలో పిల్లల భవిష్యత్ కు బంగారు బాటలు వేయడంలో సుమారుగా వందకు పైగా పిల్లలకు వారి జీవితాలకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు,కుటుంబం కన్నా సమాజానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి,సమాజ సేవకులుగా నిలిచారు,గ్రామంలో అమరుల స్తూపాన్ని నిర్మించి అమరుల త్యాగాలను యువతను స్మరించుకునే అవకాశం కల్పించారు,ఎందరికో రోల్ మోడల్ గా నిలిచారు, ఇలాంటి సేవకులు బుధవారం హఠాన్మరణం చెందారు,,పలువురు అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు,ఇట్టి వార్త తెలియగానే , కడసారి చూపు కోసం జనం వీడ్కోలు పలికేందుకు తరలి వస్తున్నారు,గురువారం రోజున బందు మిత్రులు, ప్రజలు అభిమానుల మధ్య అంత్య క్రియలు పూర్తి చేశారు,జనం కోసం స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపకులు లింగంపల్లి చందు ఇక లేరు అని విషయాన్ని తట్టుకోలేక పోతున్నారు,