
రఘునాథపల్లి (జనగామ) నేటి ధాత్రి :-
మండల కేంద్రంలో ని కురుమ సంఘం భవనంలో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో భూమి కోసం, భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమురయ్య 97వ జయంతిని కే వై సి స్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, మరియు రఘునాథపల్లి ఎంపీటీసీ పేర్నే ఉషా రవి కురుమ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ దొడ్డు కొమురయ్య స్ఫూర్తితో ని యువత రాజకీయంలో , ముందుండాలని , రాజ్యాధికార వైపు, అన్ని రంగాలలో కురుమ యువత ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కే వై సి స్ జనగామ జిల్లా అధ్యక్షుడు పేర్ని రవికురుమ , దావరా యాకయ్య, గుండా వెంకటయ్య, అబ్బ సాయిలు, మాల యాకయ్య, పేర్ని నరసింహులు, బడితే శ్రీనివాస్ , బాల బోయిన శ్రీనివాస్ , కొలుపుల నాగరాజు, దేవర రంజిత్, బడితే బీరయ్య, మాయ రాములు, దేవర కుమార్, కొమురయ్య, పేర్ని మల్లేష్ , ప్రసాద్, లెనిన్, వెంకటేష్, అనిల్, పరశురాములు, నరసింహులు, రాజు, వీరస్వామి, యాదగిరి, కృష్ణ, అనిల్ , నరసయ్య , శంకరయ్య , కురుమ సంఘం పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.