
పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చు ప్రధానోపాధ్యాయులు చందూరి రాజిరెడ్డి!!
. ఎండపల్లి నేటి ధాత్రి నవోదయ ప్రవేశ పరీక్ష 2024 లో ప్రవేశం సాధించిన ప్రాథమిక పాఠశాల గుల్లకోట 5వ తరగతి విద్యార్థి పొన్నం విఘ్నేశ్వర్ గౌడ్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందూరి రాజిరెడ్డి అభినందించారు ఎండపల్లి మండలం గుల్లకోట ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులందరూ సదరు విద్యార్థిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మరిన్ని సీట్లు సాధించాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని క్రమశిక్షణతో ఏకాగ్రతతో చదివితే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపదేశించారు ఇప్పటికే గుల్లకోట పాఠశాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సాధించిందని ఇంతటి ఘన కీర్తికి కారణమైన ఉపాధ్యాయ బృందం ఎస్ రమాదేవి ఎం శ్రీనివాస్ ఎన్ నరేష్ కుమార్ బీ శ్రీలత కె కృష్ణారెడ్డి శిరీష లను అభినందించారు ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు ,