రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన మోర బద్రేశం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 320జి 2024 -25 రెండవ ఉప గవర్నర్ గా గెలుపొందిన సందర్భంగా గోపాలరావుపేట అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఆయన స్వగృహం నందు శాలువాతో సన్మానించారు. ఈసందర్భంగా అంబేద్కర్ యూత్ క్లబ్ అధ్యక్షులు రేణికుంట అశోక్ మాట్లాడుతూ మాగ్రామానికి చెందిన మోర బద్రేశం గతకొన్ని సం.ల నుండి లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజలే తమ ధ్యేయంగా భావిస్తూ ప్రజల మంచి, చెడులయందు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ తమవంతుగా యువతను చైతన్యపరుచుటలో కీలకపాత్ర పోషిస్తున్న మోర బద్రేశం ఇంకా మునుముందు ఎన్నో ఉత్తమ సేవలు చేస్తూ అనేక పదవులు పొంది మాగ్రామానికి మంచిపేరు తీసుకురావాలని కొనియాడారు. ఈకార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు లింగంపెల్లి రవి, వేల్పుల రవి, ఆరెల్లి రాజశేఖర్, దాసరి సంతోష్, గంగాధర శ్రీనివాస్, రేణికుంట సతీష్, సిపెల్లి మధు, తదితరులు పాల్గొన్నారు.