
ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ నాయకులు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ చెల్లించకపోవడం దారణమని,వెంటనే స్కాలర్షిప్ విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ ( AISB) జిల్లా నాయకులు కనుకుంట్ల సన్నీ గౌడ్ అన్నారు. సోమవారం రామకృష్ణాపూర్ లో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7800 కోట్ల పైచిలుకల పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయంబర్స్మెంట్స్ ఉన్నాయని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించడానికి ముందే విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్స్ ఫీజులు ఎంగేజ్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని, బడ్జెట్ కళాశాలలు మూసివేత దిశగా వెళ్తున్నాయన్నారు. ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా పాలసీలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి మండల కార్యదర్శి యువరాజ్, రామకృష్ణాపూర్ పట్టణ కార్యదర్శి చందు తదితరులు పాల్గొన్నారు.