
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలో నవత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను శనివారం పాఠశాల కరస్పాండెంట్ పత్తిపాక నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి, ఈ సందర్భంగా కరస్పాండెంట్ నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుండి కష్టపడి చదివి మంచిగా ఎదగాలన్నారు అలాగే చదువుతోపాటుగా ఆటపాటలు సంస్కృతిక కార్యక్రమాలు కూడా పిల్లలకు అవసరమని తెలియజేశారు మానసిక వికాసానికి తోడ్పడతాయని తెలియజేశారు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా సౌకర్యం కోసం రాబోవు విద్యా సంవత్సరం నుండి డిజిటల్ తరగతులు ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు, నవత ఇంగ్లీష్ మీడియం పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఫలితాలు సాధిస్తుందని అన్నారు, కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు. విద్యార్థులు. తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.