న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా మోహన్ కుమార్ యాదవ్ విజయం.

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి న్యాయ
వాదుల సంఘం అధ్యక్షునిగా సి మోహన్ కుమార్ యాదవ్ గెలుపొందారని ఎన్నికల అధికారులు ఉత్తరయ్య రఘు ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు . ప్రధాన కార్యదర్శిగా బాల నాగయ్య మహిళా ప్రతినిధిగా శ్రీదేవి ఎన్నికలలో విజయం సాధించారని వారు తెలిపారు . పోటీలో ఎవరు లేకపోవడంతో ఉపాధ్యక్షులుగా డేగల కృష్ణయ్య జె బ్రహ్మయ్య చారి సహాయ కార్యదర్శిగా పి శంకర్ కోశాధికారిగా ఎం ఆంజనేయులు క్రీడల అధికారిగా ఎన్ రందూలి గ్రంథాలయ కార్యదర్శిగా ఎం కృష్ణయ్య కార్యవర్గ సభ్యులుగా రాజి రియాజ్ అహ్మద్ ఎన్ త్రినాథ్ ఎన్ తిరుపతయ్య వేదవ్యాస్ ఎన్నికయ్యారని వారి పేర్కొన్నారు. నూతన న్యాయవాదుల సంఘం కార్యవర్గం ఏప్రిల్ ఒకటిన ప్రమాణ స్వీకారం ఉంటుందని ఎన్ని కల అధికారులు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!