మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
భూపాలపల్లి నియోజకవర్గంలోని పలువురు ఆత్మీయులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు సతీమణి గణపురం జడ్పిటిసి గండ్ర పద్మ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన తూముల సదయ్య కూతురు వివాహ వేడుకలకు హాజరైన గండ్ర పద్మ పోతుగల్లు గ్రామానికి చెందిన చింతల రమేష్ కూతురు వివాహ వేడుకలు మండల కేంద్రంలోని అమ్మ గార్డెన్ లో, ఇస్సిపేట గ్రామానికి చెందిన అంబాల శ్రీనివాస్ కూతురు వివాహ వేడుకలు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్ లో, గణేష్ పల్లి గ్రామానికి చెందిన తిప్పని రాజేశ్వర్ రావు కూతురు వివాహ వేడుకలు తన స్వగృహంలో, పర్లపల్లి గ్రామానికి చెందిన బోయిని మల్లయ్య కుమారుడి రిసెప్షన్ వేడుకలు తన స్వగృహంలో, అలాగే పర్లపల్లి గ్రామానికి చెందిన గాదం కుమారస్వామి కూతురు వేడుకలు తన స్వగృహంలో జరుగగా..పలు వివాహ వేడుకలకు హాజరైన గండ్ర పద్మ నూతన వధూవరులను ఆశీర్వదించి..అక్షింతలు వేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు కలకాలం పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో, జిల్లా పాపలతో, సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుతోట కుమారస్వామి మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మొహమ్మద్ రఫీ మంగళపల్లి శ్రీనివాస్ దాన వీణ మొగిలి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న గండ్ర పద్మ
